తెలంగాణ

telangana

ETV Bharat / crime

Three people died:కుమురం భీం జిల్లాలో విషాదం.. పిడుగులు పడి ముగ్గురు మృతి

Three people died
పిడుగులు పడి ముగ్గురు మృతి

By

Published : Jun 20, 2022, 5:20 PM IST

Updated : Jun 20, 2022, 5:58 PM IST

17:18 June 20

Three died: కుమురం భీం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి

Three people died: పిడుగు పాటు ముగ్గురిని బలి తీసుకుంది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ఒక మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.

జిల్లాలోని కాగజ్‌నగర్ మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. అంకుశాపూర్‌ వద్ద పిడుగుపడి నానాజీ(40) అనే వ్యక్తి మృతి చెందారు. రాస్పల్లి గ్రామం వద్ద పిడుగుపాటుకు సుమన్‌(28) అనే యువకుడు బలయ్యాడు. మరో ప్రాంతమైన కౌటాల మండలం వైగామ్‌ వద్ద పిడుగుపడడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

Weather in TS: బయటకు వెళ్తున్నారా.. గొడుగు మరవొద్దు!!

జూదంలో భార్యను ఓడిన వ్యక్తి.. ఇతరులతో శారీరక సంబంధానికి ఒత్తిడి

Last Updated : Jun 20, 2022, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details