తెలంగాణ

telangana

Three died in river: నదిలో మునిగి ముగ్గురు మృతి

By

Published : Jul 11, 2021, 7:25 PM IST

ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Three died in river in AP
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో విషాదం

ఏపీలోని విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామంలో విషాదం (tragedy) చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పెద్దేరు నది (pedderu river)లో మునిగి ముగ్గురు మృతి చెందారు. మృతులు వడ్డాది గ్రామానికి చెందిన గుడ్ల రాము (48), కొల్లి మల్ల శ్రీను (45), గొలుగొండకు చెందిన షికారు దారకొండ (65)గా గుర్తించారు.

మృతులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారా..? చేపలు పట్టేందుకు వెళ్లి నదిలో దిగారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు (enquiry) చేస్తున్నారు. బంగారుమెట్ట వద్ద పెద్దేరు నది లోతు ఎక్కువ ఉండటంతో... నీటిలో మునిగిపోయి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

Tragedy: ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకింద పడిన తల్లి

ABOUT THE AUTHOR

...view details