తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident: నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం - THREE PEOPLE DIED IN ROAD ACCIDENT

THREE PEOPLE DIED IN ROAD ACCIDENT, NAGARKURNOOL DISTRICT
ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ... ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

By

Published : Sep 19, 2021, 12:08 PM IST

Updated : Sep 19, 2021, 3:05 PM IST

12:04 September 19

Accident: నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

       నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమలలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. దేవరకొండ డిపో బస్సు-ఆటోను ఢీ కొట్టింది. పదర మండలం మద్దిమడుగు ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది.  ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  మద్దిమడుగు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది.

     వారిలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జెటవాత్ తాండ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Accidents: వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

Last Updated : Sep 19, 2021, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details