ORR Accident: ఔటర్ రింగ్‌రోడ్డు రక్త మోడింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద చోటు చేసుకుంది. మృతులు మహారాష్ట్ర వాసులైన సందీప్, ఆనంద్, రంగనాథ్‌గా పోలీసులు గుర్తించారు.
ORR Accident: ఓఆర్ఆర్పై ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి - road accident onorr
18:37 July 04
ORR Accident: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వీరంతా హయత్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి పరిశీలించారు.
ఇవీ చదవండి:Woman murder:సైకో కిల్లర్ దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య
భర్తను వీడి ప్రియుడి ఇంటికి 'ఆమె'.. వివస్త్రను చేసి చితకబాదిన గ్రామస్థులు