నిజామాబాద్ జిల్లాలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. నగరంలోని ముగ్గురు వ్యక్తులు కత్తులతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నగరంలోని ధర్మపూరి హిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో బిహారి గౌస్ అలియాస్ అయూబ్ మృతి అనే పాత నేరస్థుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయూబ్, ఉస్మాన్‌తో పాటు మరో వ్యక్తి కత్తులతో దాడి చేసుకున్నారని వెల్లడించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బిహారి గౌస్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని పేర్కొన్నారు.
ముగ్గురు వ్యక్తులు కత్తులతో పరస్పర దాడులు.. ఇద్దరు మృతి - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లాలో కత్తులతో పరస్పర దాడులు కలకలం రేపాయి. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు పరస్పర దాడులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్‌లో కత్తిపోట్ల కలకలం, కత్తి పోట్ల ఘటనలో ఇద్దరు మృతి
నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉస్మాన్ చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయూబ్ బోధన్‌లోని శంకర్ నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు వెల్లడించారు. మరొకరు 6 టౌన్‌కు చెందిన వ్యక్తి అని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయూబ్ వృత్తిరీత్యా పాత ఇనుము వ్యాపారం చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు.
- ఇదీ చదవండి:అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత