యువతిని ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో పాటు ఆమెను బ్లాక్మెయిల్ చేసి వంచించిన మరో ఇద్దరిని పోలీసులు కటకటాల్లోకి పంపించారు. యువతి భయాన్ని ఆసరా చేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆమె జీవితంతో చెలగాటమాడి..కుదిరిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో చేసుకుంది.
సీఐ లక్ష్మణరావు కథనం ప్రకారం..
విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ అభ్యసించింది. ఆ సమయంలో వల్లరిగుడబ గ్రామానికి చెందిన వాసుదేవరావు.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. కొంతకాలం ఇద్దరూ స్నేహంగా తిరిగారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె స్నానం చేస్తున్న ఫొటోలను సేకరించాడు. డిగ్రీ పూర్తయ్యాక యువతి ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఆమె పట్ల ఇష్టపడుతున్నట్లు నటిస్తూ వచ్చాడు. సదరు యువతి ప్రియుడు వాసుదేవరావు ఆమె పనిచేసే చోటకు వచ్చి తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఇది గమనించిన యువతి సహోద్యోగి ఆమెను బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లొంగదీసుకున్నాడు. అంతేకాక ఆమెను బెదిరిస్తూ వచ్చాడు. ఇద్దరి నుంచి మోసపోయిన ఆమె వ్యవహారం తెలుసుకున్న పట్టణానికి చెందిన ఓ పురోహితుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. యువతికి చెందిన నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లొంగదీసుకున్నాడు.