ఆంధ్రప్రదేశ్లోని విజయనరం జిల్లా సాలూరు పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏపీలోని విజయనగరంలో 385 కిలోల గంజాయి పట్టివేత - గంజాయి తరలిస్తున్న ఒడిశా నిందితుల అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో... గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 385 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏపీలోని విజయనగరంలో 385 కిలోల గంజాయి పట్టివేత
వారి వద్ద నుంచి 385 కేజీల గంజాయి, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.