ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ముగ్గుర్ని అతి కిరాతకంగా హత్య చేసి.. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు. ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న హైదరఖాన్ వీధిలో ఈ ఘటన జరిగింది. గుల్జార్ బేగం పెద్ద కుమారుడు కరీముల్లా అతని భార్యకు కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది. ఈ విషయంలో తనకు సహకరించాలని తల్లిని, చెల్లిని, తమ్ముడిని అడిగేవాడు.
తల్లి, తమ్ముడు, చెల్లిని హత్య చేసి... - ప్రొద్దుటూరులో ముగ్గురు హత్య అప్డేట్స్
ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గుర్ని కిరాతకంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు.
కడప జిల్లా వార్తలు, కడప జిల్లాలో దారుణం, కడప జిల్లాలో ముగ్గురి హత్య
ఇదే విషయంలో వారితోనూ కరీముల్లా గొడవ పెట్టుకున్నాడు. వారు సహకరించటం లేదనే అక్కసుతో.. తెల్లవారుజామున.. నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- ఇదీ చదవండి :ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి- బంధువుల ఆందోళన