Three persons died due to liquor: మద్యం తాగి మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వలస కూలీలు మృతి చెందిన ఘటన ఏపీలోని అనంతపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 'అనంత గ్రామీణ ప్రాంతం ఆలమూరుకి చెందిన రాజు అనే వ్యక్తికి సంబంధించిన ద్రాక్ష తోటలో పని చేయడానికి మహరాష్ట్ర నుంచి ఐదుగురు వ్యక్తులు వచ్చారు. రెండు రోజులు క్రితం సొంత రాష్ట్రానికి వెళ్లిన ముగ్గురు కూలీలు.. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అందులోని ఓ వ్యక్తి మద్యం బాటిళ్లను తీసుకొచ్చాడు.
మద్యం తాగి ముగ్గురు వలస కూలీలు మృతి, ఎక్కడంటే - ఏపీ నేర వార్తలు
Three persons died due to liquor ఏపీలోని అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగి మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వలస కూలీలు మరణించారు. మృతి చెందిన వారి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ముగ్గురు వలస కూలీలు మృతి
ఆ తర్వాత ముగ్గురు కలిసి రాత్రి మద్యం సేవించారు. తోటలో పడిపోయి ఉండాటాన్ని గమనించిన యజమాని.. పోలీసులకు సమాచారం అందించారు. తోటలోనే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఇద్దరు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు' అని వెల్లడించారు. మృతి చెందిన వారి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: