మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళను అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాళ్లు, చేతులు బంధించి తనపై అత్యాచారం చేశారని.. అపై అశ్లీల చిత్రాలు తీసి బెదిరించినట్లు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
gang Rape Case in hyderabad: అత్యాచారం చేసి.. వీడియోలు తీసి బెదిరింపులు - హైదరాబాద్ వార్తలు
మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళను అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాళ్లు, చేతులు బంధించి తనపై అత్యాచారం చేశారని.. ఆపై అశ్లీల చిత్రాలు తీసి బెదిరించారని బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
rape
గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలోని చోటా బాజార్‌లో నివాసం ఉంటున్న ఎకాత్తాతూ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి... నెల రోజుల క్రితం అత్యాచారం చేశారని బాధిత మహిళ పేర్కొంది. ఎవరికైనా విషయం చెబితే ప్రాణాలు తీస్తామని అని బెదిరించడంతో నెల రోజుల నుంచి ఎవరికీ చెప్పుకోలేదని తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Accident live video: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరి పరిస్థితి విషమం
Last Updated : Nov 7, 2021, 8:34 PM IST