తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెవెన్యూ అధికారుల ఎదుటే రైతుల ఆత్మహత్యాయత్నం - Mahabubabad District Latest News

మహబూబాబాద్‌ జిల్లా సీరోలులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. భూవివాదాలే కారణమై ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.

Three suicide attempts with land disputes
భూవివాదాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 24, 2021, 8:12 AM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సీరోలులో భూవివాదాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగిన వారిని ఆస్పత్రికి తరలించారు. దారి విషయంలో గొడవ జరిగి ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.

వివాదంలో..

సీరోలులోని ఎల్లయ్య, వీరేశం, శిల్పకు చెందిన వ్యవసాయ భూమి నుంచి వెళ్లేదారి గత కొన్నేళ్లుగా వివాదంలో ఉంది. దాన్ని ఆక్రమించారంటూ రైతులు వెంకటేష్‌, రాజు, రమేష్‌, వెంకన్న తరుచూ అడుగుతుండటంతో ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాట్లాడుతుండగా..

దారి చూపించడానికి రెవెన్యూ అధికారులు జేసీబీతో అక్కడకు చేరుకున్నారు. వీరు ముగ్గురు వారితో మాట్లాడుతుండగానే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారుల వద్ద ప్రస్తావించగా గతంలో దారి విషయంలో ఉన్న గొడవ నిజమేనన్నారు. భూమి సర్వే కోసం వెళ్లగా వారు ఉద్దేశపూర్వంగానే పురుగుల మందు తాగారని తెలిపారు.

ఇదీ చూడండి:ఓ వృద్ధురాలి వేదన... సాయం కోసం ఎదురుచూపు

ABOUT THE AUTHOR

...view details