తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి.. తాత, తండ్రి, మనుమడు మృతి.. - చెరువులో పడి ముగ్గురు మృతి

Three members of the same family fell into a pond and died
Three members of the same family fell into a pond and died

By

Published : Mar 13, 2022, 3:16 PM IST

Updated : Mar 13, 2022, 4:33 PM IST

15:14 March 13

చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చిన్నగురిజాలలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి.. తాత, తండ్రి, మనుమడు మృతి చెందారు.

గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(65) తనకున్న పొలంలో మక్కజొన్న వేశాడు. చేనులో మొక్కజొన్న ఏరేందుకు కృష్ణమూర్తితో పాటు కుమారుడు నాగరాజు(34), మనుమడి దీపక్​ (లక్కీ(12)) కూడా వచ్చారు. మొక్కజొన్న ఏరిన అనంతరం చెరువులో కాళ్లు, చేతులు కడుక్కుందామని ముగ్గరు చెరువులో దిగారు. అయితే ప్రమాదవశాత్తు నాగరాజు జారి చెరువులో మునిగాడు. నాగరాజును కాపాడేందుకు అతడి తండ్రి కృష్ణమూర్తి చెరువులోపలికి వెళ్లాడు. తాత, తండ్రి ఇద్దరూ కనిపించకపోవటంతో ఏం జరిగిందోనన్న భయంతో.. నాగరాజు కుమారుడు లక్కీ కూడా చెరువులో దిగాడు. చెరువులో దిగిన ముగ్గురు మళ్లీ పైకి రాలేదు.

ఆ ప్రాంతంలో జేసీబీతో తీసిన గుంటలు ఉండటం వల్ల.. అందులో మునిగి ఊపిరాడక ముగ్గురూ మృతి చెందారు. ఒకే కుంటుంబానికి చెందిన తాత, తండ్రి, మనుమడు మరణించటంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే ప్రమాదంలో మూడు తరాల వ్యక్తులు చనిపోవటంతో కుటుంబం తీరని దుఃఖంలో మునిగిపోయింది. బాధిత కుటుంబాన్ని నర్సంపేట ఎమ్యెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 13, 2022, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details