Jangaon Road accident news: కారు, టాటా ఏస్ వాహనం ఢీ.. ముగ్గురు దుర్మరణం
12:32 December 03
జనగామ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Jangaon Road accident news: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగాల ఘనపురం మండలం వనపర్తి వద్ద సూర్యాపేట జనగామ జాతీయ రహదారిపై కారు-టాటాఏస్ వాహనం ఢీకొని.... ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.
అంత్యక్రియల కోసం వెళ్తూ...
కారు-ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని.... కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతులు హైదరాబాద్ శేరిలింగపల్లికి చెందిన చిన్నశేఖర్‌రెడ్డి, ధనలక్ష్మి... వారి కుమారుడు రఘురామరెడ్డిగా గుర్తించారు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి వెళ్తుండగా... వనపర్తి దాటాక టైర్ పంక్చర్ అయి కారు అదుపు తప్పి... ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని డీకొట్టింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికుల సాయంతో బయటకు తీశారు. శవ పరీక్ష కోసం మృతదేహాలను జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Shilpa Chowdary custody news: శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకున్న పోలీసులు