పెద్దపల్లి జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి - Train accident in Peddapally district
16:25 September 20
పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం
Three laborers died in Ballarsha train collision పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బల్లార్షా రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈరోజు మధ్యాహ్నం కొత్తపల్లి గ్రామ శివారులో దుర్గయ్య, శ్రీనివాస్, వేణు, శీను అనే నలుగురు కూలీలు రైల్వే పట్టాలకు గ్రీసు రాసే క్రమంలో అతివేగంగా వచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అనే కూలీ మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
హుస్సేన్‌మియా వాగువద్ద ట్రాక్ మరమ్మతుల చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలు గుర్తుపట్టనంత దారుణంగా మారిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది.
ఇవీ చూడండి: