Accident: ట్రాక్టర్, మినీ లారీ ఢీకొని ముగ్గురు మృతి - ఆదిలాబాద్ జిల్లా తాజా నేరవార్తలు
![Accident: ట్రాక్టర్, మినీ లారీ ఢీకొని ముగ్గురు మృతి Three killed in tractor mini truck collision at adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12484468-914-12484468-1626485150368.jpg)
06:52 July 17
ట్రాక్టర్, మినీ లారీ ఢీకొని ముగ్గురు మృతి
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా ధర్మారం నుంచి నాగ్పూర్ వైపు టమాట లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు ఓ మినీ లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ రామాంజనేయులు, క్లీనర్ ఖాజా, ట్రాక్టర్ డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
విషయం గుర్తించిన స్థానికులు దగ్గరకు వెళ్లి చూసేసరికి... లారీ డ్రైవర్ తప్ప మిగతా ముగ్గురు చనిపోయి ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాకర్టర్ డ్రైవర్ సహా మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:WATER DISPUTES: ఇక వివాదాలు తేల్చాల్సింది ట్రైబ్యునలే!