ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విషాదం జరిగింది. కనికిలో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. పొలం పనులకు వెళ్లి ఎడ్లబండిలో తిరిగివస్తుండగా పిడుగుపడి ప్రాణాలు కోల్పోయారు.
Lightning strike: పిడుగుపాటుకు ముగ్గురు మృతి - పిడుగుపాటుకు ముగ్గురు మృతి
![Lightning strike: పిడుగుపాటుకు ముగ్గురు మృతి lightning strike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12959449-953-12959449-1630671863635.jpg)
17:47 September 03
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ..
ముత్యంపేటకు చెందిన బొర్కుట్ పున్నయ్య, పద్మకు... కనికి గ్రామ సమీపంలో పక్కపక్కనే పొలాలున్నాయి. పొలం పనులు ముగించుకున్న పద్మ... కుమర్తె శ్వేతతో పాటు మరో ఇద్దరితో కలిసి బొర్కుట్ పున్నయ్య ఎడ్లబండిలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో వర్షం మొదలవగా... వీరు ప్రయాణిస్తున్న బండిపై పిడుగు పడింది.
పిడుగుపాటుకు బండిలో ఉన్న అయిదుగురులో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఓ ఎద్దు కూడా మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:GOLD SMUGGLING: శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత