Road Accident Today: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(41), ఓదమ్మ(40), హారిక(4).. రాత్రి ఆటోలో వేములవాడ వెళ్తుండగా బావుపేట వద్ద ఆటో బోల్తా పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.
కరీంనగర్ జిల్లాలో ఆటో బోల్తా.. ముగ్గురు మృతి - కరీంనగర్ జిల్లాలో ఆటో బోల్తా
కరీంనగర్ జిల్లాలో ఆటో బోల్తా
11:52 May 13
కరీంనగర్ జిల్లాలో ఆటో బోల్తా పడి ముగ్గురు మృతి
Last Updated : May 13, 2022, 12:27 PM IST