కల్లుతాగి ముగ్గురు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు కేసును సుమోటోగా స్వీకరించి గ్రామంలో విచారించారు. బాధిత కుటుంబ సభ్యులెవ్వరూ ఫిర్యాదు చేయకపోవడం వల్ల గ్రామంలో విచారణ జరిపి కుటుంబ సభ్యుల సమక్షంలో మృతులు వెంకట్రాముడు, వెంకన్న, సిద్దయ్య మృతదేహలకు శవ పరీక్షలు నిర్వహించారు.
కల్లుతాగి ముగ్గురు మృతి.. సుమోటోగా తీసుకున్న పోలీసులు - తెలంగాణ తాజా వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో కల్లు తాగిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై గద్వాల ఆర్డీవో రాములు, డీఎస్పీ యాదగిరి గ్రామంలో విచారణ జరిపారు. మృతుల కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
జోగులాంబ గద్వాల వార్తలు
జల్లాపురం గ్రామంలో కల్తీ కల్లుతాగి ముగ్గురు చనిపోయారని తెలుసుకుని విచారణ చేపట్టామని… ముగ్గురు తహసీల్దార్లు, నలుగురు వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్