Jagityal Accident: జగిత్యాల జిల్లాలో బైక్, ఆటో ఢీకొని ముగ్గురు మృతి - Telangana news
19:05 January 30
రాజారాంపల్లి స్టేజి వద్ద ప్రమాదం
Jagityal Accident: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా... అయిదుగురు గాయపడ్డారు. క్షత గాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనీలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో పనిచేసే కూలీలు జగిత్యాలలో వంట సరుకులు కొనుగోళు చేసుకుని ఆటోలో బయలు దేరారు.
రాజారం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనటంతో ఆటో పల్టీలు కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న బత్తిని సంజీవ్ అక్కడిక్కడే మృతి చెందగా... మధు తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన సుధాకర్, గోపాల్ మృతి చెందారు. కూలీలు జితేంద్ర, సురేశ్, హర్షకుమార్, బీహిను గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ప్రమాదానికి కారణం మైనర్ డ్రైవింగ్... యజమానితో పాటు మైనర్లు అరెస్టు'