ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు - accident in jangaon district
12:07 June 05
ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వరంగల్ జిల్లా , ఖిలా వరంగల్ మండలం చింతల్ కు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు టవేరా వాహనంలో హైదరాబాద్ వెళ్తుండగా.. రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి దర్గా వద్దకు రాగానే టైరు పంక్చరై అదుపుతప్పింది. ఈ క్రమంలో రహదారిపై 70 మీటర్ల మేర పల్టీలు కొడుతూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికీ అదుపుకాక డివైడర్‌పైనే వాహనం దూసుకెళ్లింది. కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయారు. వీరిలో అఫ్రిన్ బేగం, ఫర్జాబ్ బేగం, శాఖత్ హుస్సేన్ అక్కడికక్కడే చనిపోయారు.
మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. హైదరాబాద్లో ఉన్న బంధు మిత్రులను కలవడానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో చింతల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి..