తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gas Cylinder Blast in Manthani : వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి గాయాలు - cylinder blast in manthani

వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్
వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్

By

Published : Nov 29, 2021, 11:57 AM IST

Updated : Nov 29, 2021, 12:45 PM IST

11:52 November 29

వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి గాయాలు

Gas Cylinder Blast in Manthani : భోజన సమయం అయిందని ఆ ఇల్లాలు వంట చేయడానికి వంటగదిలోకి వెళ్లింది. చివరి కార్తిక సోమవారం కావడంతో రుచికరమైన శాకాహార వంటలు, తీపి పదార్థాలు వండుదామనుకుంది. ఎంతో హుషారుగా కిచెన్​లోకి వెళ్లి కూరగాయలు తరిగింది. ఇక వంట మొదలు పెడదామనుకుని గ్యాస్ సిలిండర్ ఆన్ చేసింది. అంతే ఒక్కసారిగా గ్యాస్ పైపు ఊడిపోయింది. ఏం చేయాలో ఆలోచిస్తుండగానే.. మంటలు ఆ గదంతా వ్యాపించాయి. ఆ ఇల్లాలి అరుపులతో కిచెన్​లోకి వచ్చిన మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు ఆమెతోపాటు మంటలు అంటుకున్నాయి. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల వారు బాధితుల ఇంట్లోకి పరుగు తీసి మంటలు ఆర్పారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని మంథని మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.

Cylinder blast Peddapalli : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలోని ఓ ప్రమాదం జరిగింది. వంట చేస్తుండగా.. గ్యాస్ పైపు ఊడిపోయి మంటలు వ్యాపించాయి. ఇల్లాలి అరుపులతో వంటగదిలోకి వచ్చిన మరో ఇద్దరు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చి చూసేసరికి ముగ్గురు మంటల్లో కాలిపోతున్నారు. వెంటనే వారు మంటలు ఆర్పి వారిని మంథని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవలే జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని బోయవాడలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోయవాడలో ఉంటున్న వృద్ధురాలు వేడినీళ్ల కోసం గ్యాస్​ ఆన్​ చేయబోయింది. ఈ క్రమంలో సిలిండర్​ పేలింది. ప్రమాదంలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనాస్థలంలోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Gas cylinder insurance price: ఇటీవల తరచుగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటివల్ల భారీ ధన, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. అయితే ఈ ప్రమాదాలు జరిగినపుడు బాధితులను ఆదుకోవడం కోసం బీమా సదుపాయం ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గ్యాస్ ప్రమాదాల్లో ఎంతవరకు బీమా పొందొచ్చో తెలుసా...? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Nov 29, 2021, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details