Tragedy : ఒకే వీధిలో ముగ్గురు యువతులు అదృశ్యం.. చెరువులో మృతదేహాలు - three young women found dead in dharma Samudram pond
13:47 October 28
Tragedy : ఒకే వీధిలో ముగ్గురు యువతులు అదృశ్యం.. చెరువులో మృతదేహాలు
జగిత్యాల జిల్లా ఉప్పరిపేటలో విషాదం(tragedy) చోటుచేసుకుంది. బుధవారం రోజున అదృశ్యమైన ముగ్గురు యువతు(Three young women were missing)ల మృతదేహాలు ఇవాళ ధర్మసముద్రం చెరువులో లభ్యమయ్యాయి.
ఉప్పరిపేట గ్రామంలో ఒకే వీధికి చెందిన ముగ్గురు యువతులు వందన, మల్లిక, గంగాజల బుధవారం రోజున అదృశ్యమయ్యారు(Three young women were missing). సాయంత్రమైనా ఇంటికి రాకపోవడం వల్ల వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం బుధవారం రోజంతా గాలించారు. ఈ ముగ్గురు బంధువులేనని స్థానికులు పోలీసులకు చెప్పారు.
చివరకు.. గురువారం మధ్యాహ్నం.. ధర్మసముద్రం చెరువులో మృతదేహాలు(three young women found dead in a pond) తేలడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహాలు వెలికితీసిన పోలీసులు వారిని.. అదృశ్యమైన యువతుల్లో గంగాజల, మల్లికలుగా గుర్తించారు. మరో యువతి వందన కోసం చెరువులో గాలించగా.. కాసేపటికి మూడో యువతి మృతదేహాం కూడా దొరికింది. ఈ ఘటనకు సంబంధించి కారణాలేవి ఇంకా తెలియదని.. ముగ్గురు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమింకంగా భావిస్తున్నారు.