తెలంగాణ

telangana

ETV Bharat / crime

సగిలేరు వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి - విఠముసురుపల్లెలో వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి

పొలం దగ్గర ముగ్గురు బాలికలు సరదాగా గడిపారు. సంతోషంగా అన్నం తిన్నారు. నీటి కోసం పక్కనే ఉన్న సగిలేరు వాగులో దిగారు. కానీ అదే వాగు వారిని మింగేస్తుందని తెలీదు పాపం. పట్టుతప్పడం వల్ల ఆ ముగ్గురు బాలికలను మృత్యువు తనతో పాటు తీసుకెళ్లింది. ఏపీలోని విఠముసురుపల్లెలో తీవ్ర విషాదాన్ని నింపింది.

three-girls-died-in-canal-at-giddaluru in prakasham district
సగిలేరు వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి

By

Published : Feb 11, 2021, 7:47 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విఠముసురుపల్లెలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలానికి వెళ్లిన ముగ్గురు బాలికలు సుప్రియ(8), వెంకటదీప్తి(13), సుస్మిత(13) అన్నం తిని.. నీటి కోసమని పక్కనే ఉన్న సగిలేరు వాగులో దిగారు. పట్టుతప్పి ముగ్గురూ వాగులో పడ్డారు. గమనించిన ఓ బాలుడు.. పొలంలో పనిచేస్తున్న వారికి సమాచారం ఇచ్చాడు.

సగిలేరు వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి

వారు వాగు వద్దకు వచ్చి బాలికలను బయటకు తీసి.. గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు బాలికలూ చికిత్స పొందుతూ..మృతి చెందారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో, వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఘట్​కేసర్ అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details