ఏపీ తిరుపతి వైకుంఠపురంలో విషాదం నెలకొంది. మ్యాన్‌హోల్‌లో దిగిన విషవాయువు పీల్చి కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. మ్యాన్‌హోల్ శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు నడుముకు తాడు కట్టుకుని లోపలికి దిగారు. ఆ సమయంలో విషవాయువులు లీకై ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. వారిని కాపాడేందుకు మరో వ్యక్తి మ్యాన్ హోల్‌లో దిగాడు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు వారిని బయటకు తీయించారు. హుటాహుటిన ఆటోల్లో ఆస్పత్రికి తరలించారు. ఆర్ముగం అనే కార్మికుడు మృతి చెందగా.. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మ్యాన్‌హోల్‌లో దిగి కార్మికుడు మృతి... మరో ఇద్దరి పరిస్థితి విషమం - మ్యాన్ హోల్‌లో పడి కార్మికుడు మృతి
ఏపీ తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్ శుభ్రం చేసేందుకు దిగి ఓ కార్మికుడు ప్రాణాలు వదిలాడు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు.
manhole cleaning death