గుడిలో మైక్ సెట్ చేస్తుండగా విద్యుదాఘాతం.. ముగ్గురు మృతి - three died in a temple in dornakal
11:22 June 21
గుడికి మైక్ సెట్ చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఆలయంలో మైక్ సెట్ చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. గతరాత్రి వర్షం కురవడంతో తీగల్లో విద్యుత్ ప్రవహించి అకస్మాత్తుగా కరెంట్ షాక్ వచ్చిందని స్థానికులు చెప్పారు. ముగ్గురు ఒకరికొకరు అంటుకుని ఉండటంతో విద్యుత్ షాక్‌కి గురై ఒక్కసారిగా కుప్పకూలారని తెలిపారు. మృతులు సుబ్బారావు(67), మస్తాన్‌రావు(57), వెంకయ్య (55)లుగా గుర్తించారు.
గ్రామంలో ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దైవకార్యం కోసం వస్తే తమ ఇంటి యజమానులు దేవుడి దగ్గరికే వెళ్లిపోయారంటూ ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.