Three Died in Road Accident: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వలస కార్మికులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆశిష్ ముజుందార్(20), శివనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గుల్‌దేవ్ బహుదూర్ బీరంగూడలో ఉంటూ చిట్కుల్ గ్రామపరిధిలో భవన నిర్మాణంలో సెంట్రింగ్ విభాగంలో పనులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే పనులు ముగించుకుని బుధవారం రాత్రి వారి గదికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ(21), అజిత్(21)లు తమ ద్విచక్ర వాహనంపై ఏపీఆర్ కాలనీలో సెక్యూరిటీ విధులు నిర్వహించేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఆశిష్ ముజుందార్ అతివేగంగా, అజాగ్రత్తగా బైక్ నడుపుతూ పటాన్‌చెరు శివారులో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు వలస కార్మికుల దుర్మరణం
Three Died in Road Accident: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులో చోటుచేసుకుంది. అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
ప్రమాదంలో ఆశిష్ ముజుందార్, శివ, అజిత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఆశిష్ ముజుందార్ పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించే సరికి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రెండో బైక్‌పై ఉన్న శివ, అజిత్‌లను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కార్మికుల మృతదేహాలను స్వరాష్ట్రాలకు తరలించేందుకు కుటుంబ సభ్యులకు స్థోమత లేకపోవడంతో సీఐ వేణుగోపాల్‌రెడ్డి చొరవ తీసుకుని ఏపీఆర్ కాలనీ అసోసియేషన్, లేబర్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి స్వస్థలాలకు మృతదేహాలను పంపేలా ఆర్థిక సహాయం చేయించారు. తెరాస సీనియర్ నాయకులు మధుసూదన్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు.
ఇదీ చదవండి: ఆ తల్లిదండ్రులకు తీరని వేదన.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృతి