తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి - telangana news

rangareddy accident
rangareddy accident

By

Published : Feb 21, 2022, 9:27 AM IST

Updated : Feb 22, 2022, 9:34 AM IST

09:25 February 21

Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

హుక్కా మత్తులో మితిమీరిన వేగంతో వెళుతున్న యువకులు.. ఎదురుగా కారులో వస్తున్న ఓ కుటుంబంలోని తల్లి, అయిదేళ్ల కుమార్తెను బలిగొన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనంలోని ఓ యువకుడు సైతం మృతి చెందాడు. బీజాపూర్‌ జాతీయ రహదారిపై చేవెళ్ల మండలం కేసారం వద్ద సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన రవికిరణ్‌, స్రవంతి భార్యాభర్తలు. వీరికి ధ్రువిక, మోక్ష కుమార్తెలు. రవికిరణ్‌ వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతంలో ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. భార్య, పిల్లలతో కలిసి ఉదయం తాండూరు వెళ్తుండగా కేసారం గేటు దాటిన తర్వాత ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం ముందున్న స్విఫ్ట్‌కారును ఢీకొట్టుకుంటూ వచ్చి వీరి ఆల్టో కారుని ఢీకొట్టింది. దీంతో ఆల్టో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న మర్రి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో అందులో ప్రయాణిస్తున్న స్రవంతి(30)తో పాటు చిన్న కుమార్తె ధ్రువిక (5) అక్కడికక్కడే మరణించారు. రవికిరణ్‌, మరో పాప మోక్షకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి వెనుక నుంచి వస్తున్న మరో ఇన్నోవా కారును సైతం ప్రమాదానికి కారణమైన వాహనం ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అందులో డ్రైవర్‌ పక్క సీటులో కూర్చున్న సయ్యద్‌ ఫైసల్‌ (21) తీవ్ర గాయాలతో మరణించాడు. ఇన్నోవా నడుపుతున్న జఫార్‌, మహ్మద్‌అలీ, సయ్యద్‌రిజ్వాన్‌, అన్వర్‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన మరో రెండు కార్లలో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి.

కారులో అందరూ యువకులే..

ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న ఆరుగురు 21-22 ఏళ్ల యువకులే. పాతబస్తీకి చెందిన వీరంతా ఆదివారం సెలవు కావడంతో చేవెళ్ల మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. రాత్రంతా హుక్కా తాగుతూ జల్సా చేశారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. మత్తులో వాహనాన్ని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారకులయ్యారు. వీరి కారులో హుక్కాలో వాడే పదార్థాలు లభించాయి.

ఇదీ చదవండి:

Last Updated : Feb 22, 2022, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details