తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఢీకొన్న రెండు బైకులు, గాలిలో కలిసిన మూడు ప్రాణాలు - road accident

Three died in road accident ఒక్క రోడ్డు ప్రమాదం మూడు నిండుప్రాణాలను బలితీసుకుంది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమకు అండగా నిలుస్తారనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే.

accident
accident

By

Published : Aug 25, 2022, 7:55 PM IST

Three died in road accident: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. చింతపల్లి మండలం మడిగుంట ఘాట్​రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. అక్కడికక్కడే ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్​లో నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరూ మృతి చెందారు. మృతులు పాంగి మత్యరాజు, సన్నీ, గుంట జోసెఫ్​గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు పాడేరు డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details