Medak Road accident : లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు దుర్మరణం - తెలంగాణ వార్తలు

11:01 December 20
Medak Road accident : లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు దుర్మరణం
Medak Road accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చేగుంట వద్ద లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఉల్లితిమ్మాయిపల్లి నుంచి చేగుంటలో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగి.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
గాయపడిన ఇద్దరూ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు ఉల్లితిమ్మాయిపల్లికి చెందిన అన్నదమ్ములుగా గుర్తించారు. ఇద్దరు తమ్ముళ్లను పాఠశాల వద్ద దింపేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి:Kurnool Criminals arrest: తిని పడేసిన అన్నం ప్లేట్లే... నిందితులను పట్టించాయి