నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని చింతపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అద్దంకి- నార్కెట్‌పల్లి హైవేపై ఆగి ఉన్న లారీని ఓ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
ACCIDENT: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి - bus accident updates
05:41 August 24
చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమో లేదా నిద్ర మత్తో.. అతి వేగంగా వస్తున్న బస్సు... చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టటం వల్ల బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. ముందు కూర్చున్న వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. ఒకరిద్దరు ఇరుక్కుపోయారు. వాళ్లను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు.
ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన మల్లేశ్(44), కొత్త నాగేశ్వరరావు (40), గుంటూరు జిల్లాకు చెందిన జయ రావు(40)గా గుర్తించారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
Khiladi Arrested: ఒకే అమ్మాయి ముగ్గురిలా.. ఆమె పెర్ఫామెన్స్‌తో పోలీసులే అవాక్కయ్యారు..!