భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Road Accident News) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన ఆంబోజు కృష్ణ(35), అతని కుమార్తె జాహ్నవి(12), కుమారుడు అముల్ ప్రీతమ్(8) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా ధోమేడ నుంచి ద్విచక్రవాహనంపై మణుగూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
జయశంకర్ భూపాలపల్లి కేటీకే ఓసీ 3 నుంచి సారపాక ఐటీసీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ... దమ్మక్కపేట సమీపంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎదురుగా బైక్‌ను అధిగమించబోయి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో(Road Accident News) రహదారిపై పడిపోయిన కృష్ణ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందారు. లారీ వెనుక టైర్లు జాహ్నవి, అముల్ ప్రీతమ్ మీద నుంచి వెళ్లాయి. బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయాలైన బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.