ఏపీలోని విజయవాడ నగర శివారులోని కండ్రిక-పాతపాడు రహదారిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కండ్రిక ప్రాంతం నుంచి పాతపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన జాకీలను పల్సర్ బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Bike Accident in Vijayawada : ద్విచక్రవాహన ప్రమాదంలో ముగ్గురు మృతి - క్రైమ్ వార్తలు
ఏపీలోని విజయవాడ నగర శివారులోని కండ్రిక ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు(three died in a bike accident at Vijayawada) కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bike Accident in Vijayawada
మృతులు విజయవాడ వాంబేకాలనికి చెందిన వారుగా గుర్తించారు. అతి వేగంగా రహదారి డైవర్షన్ చూసుకోకుండా ద్విచక్రవాహనాన్ని నడపటం వల్లనే ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.