Road Accident at Kattanguru: వివాహానికి హాజరై వెళ్తుండగా నల్గొండ జిల్లాలో డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు యువకులకు గాయాలయ్యాయి. కట్టంగూరు మండలం యరసానిగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న ఇన్నోవా కారు పల్టీలు కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో 9మంది ఉన్నారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
డివైడర్ ఢీకొని కారు బోల్తా... ముగ్గురు మృతి - డివైడర్ ఢీకొని కారు బోల్తా
07:52 January 08
డివైడర్ ఢీకొని కారు బోల్తా... ముగ్గురు మృతి
హైదరాబాద్‌లో వేడుకకు హాజరై ఖమ్మం తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. మృతులు ఎండీ ఇద్దాక్, ఎస్కే సమీర్, ఎస్కే యాసిన్ కాగా.. వీరంతా ఖమ్మం ఖిల్లా బజార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం వస్తుండగా కట్టంగూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఖమ్మం యువకుల ఇళ్ల వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఖమ్మం ఖిల్లా బజార్ కు చెందిన తొమ్మిది మంది యువకులు హైదరాబాదులోని వివాహ రిసెప్షన్‌కు హాజరై తిరిగి రాత్రి రెండు గంటల సమయంలో ఖమ్మంకు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకులు కూలి పని చేస్తూ ఇంటికి ఆసరాగా ఉంటున్నారని బంధువులు చెబుతున్నారు. చేతికి అందిన కొడుకులు కళ్లముందే మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చదవండి: