తెలంగాణ

telangana

ETV Bharat / crime

కొవిడ్​తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - తెలంగాణ తాజా వార్తలు

కొవిడ్​తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మాసానిగూడలో జరిగింది.

three death with covid
three death with covid

By

Published : May 5, 2021, 11:00 PM IST

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మాసానిగూడలో కొవిడ్​ మహమ్మారి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. గ్రామానికి చెందిన వడ్ల విశ్వనాథం(58), అతని భార్య రుక్మిణి దేవి(55) వారి కుమారుడు అరుణ్​ కుమార్​... కొవిడ్​తో మృతి చెందారు. కొన్ని రోజుల కిందట కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​ వచ్చింది. అప్పుడే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతు రుక్మిణి దేవి మృతి చెందింది. అనంతరం ఆమె భర్త విశ్వనాథం మృత్యువాత పడ్డాడు.

మృతుడు అరుణ్​ కుమార్​

వీరిద్దరి మృతదేహాలకు గ్రామంలోని వారి స్థలంలోనే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి కుమారుడు అరుణ్​కుమార్​ కూడా మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:పీఎస్​కు పిలిపించారని ఆత్మహత్య.. బంధువుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details