చెరువుగట్టు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి - ts news
16:38 January 21
చెరువుగట్టు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి
Road Accident at Panthangi toll plaza: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో రామకృష్ణ భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. వారు చౌటుప్పల్ మండలంలోని లక్కారం గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. చెరువుగట్టు దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. గాయపడిన రామకృష్ణ భార్యాపిల్లలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: