ఏపీలోని అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తండా చెరువులో పడి గల్లంతైన ముగ్గురు చిన్నారులు(Three Children Died in AP) మృతిచెందారు. ఎగువ తండాకు చెందిన ఇద్దరు మహిళలు నిన్న దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా... వారితోపాటు వచ్చిన ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ లోతుకు వెళ్లిపోయారు. మహిళలు గుర్తించేలోగా వారు గల్లంతయ్యారు. చిన్నారులు లాలూప్రసాద్, పురుషోత్తం, హేమంత్ కోసం నిన్నటి నుంచి చెరువులో గాలించగా... తెల్లవారుజామున ముగ్గురు మృతదేహాలు నీటిపైకి తేలాయి.
Three Children Died in AP : చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతి - ap top news
ఏపీలోని అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తండా చెరువులో పడి గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతి(Three Children Died in AP)చెందారు. ఎగువ తండాకు చెందిన ఇద్దరు మహిళలు నిన్న దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా... వారితోపాటు వచ్చిన ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ లోతుకు వెళ్లిపోయారు. మహిళలు గుర్తించేలోగా వారు గల్లంతయ్యారు.
Three Children Died in AP
ముగ్గురు చిన్నారుల మృతి(Three Children Died in AP)తో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చెరువులో గల్లంతైన చిన్నారులు ముగ్గురు మృతి చెందడంతో తల్లితండ్రులు రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన గ్రామస్థులను కలిచివేసింది. గల్లంతైన పిల్లల్లో నాగరాజు, చిన్నిల కుమారుడు లాలు ప్రసాద్ నాయక్, అలాగే శాంతమ్మ, గోపినాయక్ ల పిల్లలు పురుషోత్తం నాయక్, హేమంత్ నాయక్ ఉన్నారు.