Three Died: వేసవి సెలవుల్లో ఖాళీగా ఉంటున్న పిల్లలు.. కాసేపు ఉపశమనం కోసం నదులపై వైపు అడుగులు వేస్తున్నారు. సరదాగా వెళ్లి.. మృత్యు సుడిగుండాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో చోట జరుగుతున్న ఈ ప్రమాదాలు.. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. చెరువులు, కుంటలు.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
చెరువులో ఈతకని వెళ్లి.. ముగ్గురు బాలురు మృతి
12:21 April 03
చెరువులో ఈతకు వెళ్లి.. ముగ్గురు బాలురు మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాలలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఊరకుంటలోకి ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ఈత రాక మృత్యువాతపడ్డారు. గొలుసుల యశ్వంత్, మారంపల్లి శరత్, పబ్బతి నవదీప్ అనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
13 ఏళ్ల యశ్వంత్ది యాదాద్రి భువనగిరి జిల్లా దాసరి గ్రామం కాగా ఆ కుటుంబం ఉపాధి కోసం తుమ్మెనాలకు వచ్చింది. బావుల్లో పూడికతీత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శరత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పదేళ్ల నవదీప్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు.
ఇదీ చదవండి: అన్నదమ్ములపై కత్తులతో దాడి... కారణం అదేనా?