ఏపీలోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో విషాదం జరిగింది. ముగ్గురు బాలురు ఈతకు నీటి కుంటలో దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. మృతులను బోల్లా వర్ధనబాబు (17), నేలపాటి కోటేశ్వరరావు(15), బత్తుల సుధాకర్ (17)గా గుర్తించారు.
విషాదం: ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృత్యువాత - Guntur District Latest News
సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృత్యువాత పడ్డారు. నీటికుంటలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఈ విషాద ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో చోటు చేసుకుంది.
ఏపీలోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో విషాదం
గ్రామానికి చెందిన నేలపాటి కోటేశ్వరరావు, బత్తుల సుధాకర్ పుల్లడిగుంటలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వగా.. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు. ఇంట్లో నుంచి వెళ్లిన పిల్లలను విగత జీవులుగా ఇంటికి తీసుకురావడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకేసారి ముగ్గురు బాలురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.