తెలంగాణ

telangana

ETV Bharat / crime

చూస్తుండగానే అగ్నికి ఆహుతైన మూడు కార్లు.. ఎంత నష్టమంటే.? - గుంటూరు తాజా వార్తలు

Car Fire: ఏపీలోని గుంటూరు నగరంలో నిలిపి ఉంచిన మూడు కార్లు దగ్ధమయ్యాయి. రూ.50లక్షల మేర నష్టం సంభవించినట్లు యజమానులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Car Fire
Car Fire

By

Published : Oct 12, 2022, 3:03 PM IST

Car Fire: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో నిలిపి ఉంచిన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థంభాలగరువు ప్రాంతంలోని నర్సిరెడ్డిపాలెంలో మూడు కార్లు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. కార్లలో అంతర్గతంగా షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే పక్కనున్న కార్లకు కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే కార్ల యజమానులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.

తక్షణమే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సమీపంలోని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా కట్టడి చేశారు. ఈ లోగా మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కార్లన్నీ కూడా ఖరీదైనవి కావటంతో రూ.50లక్షల మేర నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చూస్తుండగానే నిలిపి ఉన్న మూడు కార్లు అగ్నికి ఆహుతి.. ఎంత నష్టమంటే.?

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details