Thippayapalem Car Accident : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కంబం నుంచి శ్రీశైలం వెళుతున్న కారు టైరు పేలడంతో జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
కారులో మంటలు.. ముగ్గురు సజీవదహనం - తిప్పాయిపాలెంలో రోడ్డు ప్రమాదం

19:09 May 17
ప్రకాశం జిల్లాలో ఢీకొన్న కారు, లారీ.. ముగ్గురు సజీవదహనం
Thippayapalem Car Accident News :ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న మార్కాపురం సీఐ అంజనేయులు రెడ్డి, ఎస్సై సుమన్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
మృతులు భాకరాపేట గ్రామానికి చెందిన ఇమ్రాన్, బాలాజీ, తేజగా గుర్తించారు. వీరిలో ఇమ్రాన్ అనే యువకుడు గుంటూరులోని ఓ ప్రైవేటు టెలికాం డిపార్ట్మెంట్కు చెందిన బొలెరో వాహనానికి డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇమ్రాన్, అతని స్నేహితులు బాలాజీ, తేజ ముగ్గురూ కలిసి మార్కాపురం జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ముగ్గురు ఓకే గ్రామానికి చెందినవారు కావటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు ఆ మార్గంలో ఎందుకు ప్రయాణిస్తున్నారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి :చీర సరిగా కట్టుకోవడం లేదని ఉరేసుకున్న భర్త.. మధ్యప్రదేశ్లో కిరాతక హత్యలు