వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు వ్యవహారంలో ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం హత్యకు గురైన జయరామ్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి జైల్లో ఉంటూనే సాక్షులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు బెదిరింపులకు పాల్పడేలా లేఖలు పంపినట్లు పశ్చిమ మండల డీపీసీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ములాఖత్ కోసం జైలుకు వచ్చే స్నేహితుడు గుప్తా, శ్రీనివాస్‌లతో పాటు చంచల్‌గూడ జైలులో పని చేసే అక్బర్ చరవాణీని ఇచ్చి సహకరించారని డీసీపీ వివరించారు.
chigurupati jayaram murder case: చిగురుపాటి జయరామ్ హత్య కేసులో బెదిరింపులు.. ముగ్గురు అరెస్టు - తెలంగాణ వార్తలు
15:29 October 19
వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు
రాకేశ్ రెడ్డి స్నేహితులు గుప్తా, శ్రీనివాస్‌ల సాయంతో పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు, సాక్షులకు లేఖలు పంపి బెదిరింపులకు గురిచేశారు. జైల్లో నర్సుగా పనిచేసే అక్బర్ కూడా ఇందుకు సహకరించాడు. గుప్తా, రాకేశ్ రెడ్డి రాసిన బెదిరింపు లేఖలను చరవాణీ ద్వారా ఫొటోలు తీసి పీపీ, సాక్షులకు అక్బర్ పంపించాడు. గుప్తా, శ్రీనివాస్, అక్బర్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించాం.
-ఏఆర్ శ్రీనివాస్, పశ్చిమ మండల డీపీసీ
దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కీసరలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ను హత్య చేశారు.
ఇదీ చదవండి: