తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిర్మానుష్య ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా.. ముగ్గురు అరెస్టు - three arrested in drugs supply at Hyderabad

Drugs Supply at Yousufguda :హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో కొందరు యువకులు డ్రగ్స్‌ సేవిస్తున్నారు. మరికొందరి యువకులను మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారు. అదే సమయంలో పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి.. కొనుగోలు దారులు పరారయ్యారు. డ్రగ్స్ సేవిస్తున్నవారు మాత్రం పోలీసులకు చిక్కారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Drugs Supply at Yousufguda
Drugs Supply at Yousufguda

By

Published : Feb 26, 2022, 1:42 PM IST

Drugs Supply at Yousufguda: రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ.. డ్రగ్ డీలర్స్, స్మగ్లర్లకు దడ పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో.. డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు.. వాటి సరఫరా, వినియోగం నివారణకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. సరఫరాదారులను పట్టుకుని అరెస్టు చేస్తున్నారు. వినియోగదారులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

అరెస్టయిన వ్యక్తి

Police Seized Drugs: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 520 గ్రాముల ఎండీఎంఏ నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్‌ఐ రమేశ్ తెలిపారు. యూసుఫ్‌గూడ పరిధి జానకమ్మతోట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మహ్మద్ ఖాజా ముబీరుద్దీన్, కృష్ణానగర్‌కు చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ కార్తీక్, మోతీనగర్‌కు చెందిన అభిషేక్‌లు డ్రగ్స్ సేవిస్తుండటమే గాక.. ఇతరులకు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

అరెస్టయిన వ్యక్తి
అరెస్టయిన వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details