కొవిడ్ బాధితులకు అవరసమైన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ ఎస్ఓటీ, మేడిపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు డోస్‌లతో పాటుగా, మూడు చరవాణులు, 6 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని ఓ ఔషధ దుకాణంలో ఈ దందా జరుగుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లతో దందా.. ముగ్గురి అరెస్టు - medichal district latest news
కరోనా కారణంగా రెమ్‌డెసివిర్ ఔషధానికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఒక్క డోసును 35 వేలకు విక్రయిస్తోన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
అధిక ధరకు రెమిడెసివర్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన రామ్‌చందర్ లాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. అతని అనుచరులు ఫిర్జాదిగూడకు చెందిన కార్తిక్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీనయ్య కలిసి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఒక్క డోసు 35 వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా ఇంజక్షన్ల దందా గురించి బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి:కరోనా కాటుకు భార్యాభర్తలు మృతి