ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్వేర్ బర్త్‌డే పార్టీ.. 55 మందిపై కేసు..! - rave party in kadthal
10:30 June 13
నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు.. పోలీసులు దాడి
రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నిర్వహించిన ఓ బర్త్‌డే పార్టీ చర్చనీయాంశంగా మారింది. కడ్తాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓఎక్స్ కంటైనర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వరుణ్ గౌడ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. భరత్, జీషాన్, అన్వేష్ అనే నిర్వాహకులు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సుమారు 70 మంది యువత పాల్గొన్నారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్దంగా జన్మదిన వేడుకలు నిర్వహించటమే కాకుండా... పెద్దపెద్ద డీజే శబ్ధాల నడుమ... ఫూటుగా మద్యం సేవించి యువత చిందులు వేశారు.
సమాచారం అందుకున్న కడ్తాల్ పోలీసులు శంషాబాద్ ఎస్వోటీ సిబ్బంది సాయంతో ఫౌమ్‌హౌస్‌పై దాడి చేశారు. పార్టీ వేడుకలను అడ్డుకున్నారు. ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. 20 యువతులు సహా మొత్తం 55 మందిపై కేసులు నమోదు చేశారు. 47 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీజేను సీజ్ చేశారు. వరుణ్ గౌడ్ సహా ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: