నిజామాబాద్- మహారాష్ట్ర సరిహద్దు సాలురా వంతెనపై నాటు తుపాకీ కలకలం రేగింది. బోధన్‌కు చెందిన షేక్గౌస్ను మహారాష్ట్రకు చెందిన రామకిషన్ నాటుతుపాకీతో బెదిరించారు. దుండగుల్లో ఒకరు పట్టుబడగా.. మరొక వ్యక్తి పరారయ్యాడు. రామకిషన్‌ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుపై తొలుత సందిగ్దం నెలకొన్నా.. చివరికి బోధన్ రూరల్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన గౌస్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. గురువారం.. బోధన్ పాత బస్టాండ్ నుంచి ఆటోలో సాలురా వెళ్లుండగా.. వాహనంలో ఇద్దరు మహారాష్ట్రవాసులు ఎక్కారు. సాలురా- మహారాష్ట్ర మధ్యనున్న మంజీరా వంతెనపైకి వెళ్లగానే రామకిషన్‌తో పాటు మరో వ్యక్తి.. ఆటోడ్రైవర్ గౌస్ మెడకు నాటుతుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన గౌస్, అతని స్నేహితుడు.. దుండగుల్లో ఒకరిని పట్టుకోగా.. మరో వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యారు.