తెలంగాణ

telangana

ETV Bharat / crime

సహకరిస్తే సరి.. లేకపోతే అంతే.. 'ఆమెను' బెదిరించిన వైకాపా నేత కుమారుడు! - ap latest news

రాజకీయ పలుకుబడిని ఉపయోగించి.. ఓ అంగన్​వాడీ ఆయాను లోబర్చుకునేందుకు యత్నించాడు.. అధికార పార్టీ నేత కుమారుడు. తాను అడిగినదానికి ఒప్పుకుంటే.. చేస్తున్న ఉద్యోగాన్ని స్థాయి పెంచి పోస్టింగ్ ఇప్పిస్తా, లేకుంటే ఉన్న ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

CITU leader commits suicide after being harassed by ruling party leader in ap
సీఐటీయూ నాయకురాలు ఆత్మహత్య... అధికార పార్టీ నేత వేధింపుతోనే!

By

Published : Mar 18, 2022, 2:22 PM IST

తనకు సహకరిస్తే.. "చేస్తున్న ఉద్యోగాన్ని స్థాయి పెంచి పోస్టింగ్ ఇప్పిస్తా.. లేకుంటే ఉన్న ఉద్యోగం కూడా లేకుండా చేస్తా".. అని ఓ అంగన్ వాడీ ఆయాను అధికార పార్టీ నేత కుమారుడు బెదిరించిన వైనమిది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

ఉద్యోగోన్నతి కల్పిస్తానంటూ..

ఏపీ గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని ఓ ప్రజాప్రతినిధి కుమారుడు.. బుధవారం బాధితురాలు పనిచేస్తున్న చోటుకు వచ్చాడు. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పదోన్నతి కల్పిస్తానని, తనకు సహకరించాలని ప్రలోభపట్టే ప్రయత్నం చేశాడు. గతంలో ఓ ఉద్యోగిని తొలగించి ఆ స్థానంలో మరో మహిళను నియమించటం వెనుక తన హస్తం ఉందని, అందుకు ప్రతిఫలంగా సదరు మహిళ తనకు సహకరించిందని, అదే విధంగా నీవు కూడా సహకరించాలని, లేకుంటే చేస్తున్న ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని బాధితురాలిని బెదిరించాడు.

అతడి దురుద్దేశాన్ని గుర్తించిన ఆమె అందుకు నిరాకరించారు. తన ఉద్యోగం పోయినా ఫర్వాలేదు అందుకు ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు.. "ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత అయినా నీ సంగతి చూస్తా"నంటూ బెదిరించి వెళ్లాడు. ఈ ఘటనపై బాధితురాలు తమ శాఖ పరిధిలోని.. పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇదీచూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details