ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు... ఘటన జరిగింది గుంటూరులో కాబట్టి అక్కడి పోలీసులకు కేసును బదిలీ చేశారు. శుక్రవారం గుంటూరులోని కొత్తపేట సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏమి జరిగిందంటే...
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య పరిచయం చేసుకున్నాడు. ఆమె హైదరాబాద్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. తనకు తెలిసినవాళ్లు ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ బ్రహ్మయ్య మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో 2021 జులై 11న ఉద్యోగ విషయం మాట్లాడదామని ఏపీలోని గుంటూరు తీసుకొచ్చాడు. రైలుపేటలోని ఓ లాడ్జికి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుందామన్నాడు.