తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం: నీటి ఎద్దడితో వేల సంఖ్యలో చేపలు మృతి - fishes died latest news

నీటి ఎద్దడితో వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయి. అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.

fishes died  in nagarkurnool district
చేపలు మృతి

By

Published : Apr 2, 2021, 8:55 AM IST

చేపలు మృతి

నాగర్​కర్నూల్ జిల్లా కోడేర్​ మండలం జనుంపల్లిలోని వీరభద్రుడు చెరువులో చేపలు మృతి చెందాయి. నీటి ఎద్దడితో వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయి. ఫలితంగా మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. పొలాలను పారబెట్టుకునేందుకు మోటార్లు, వాటర్ ట్యాంక్​లతో చెరువు నుంచి అక్రమంగా నీటిని తరలించడం వల్లే చేపలు మృత్యువాతపడ్డాయని మత్స్యకారులు ఆరోపించారు. తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని వాపోయారు. చేపల మృతితో జీవనోపాధి కోల్పోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details