తెలంగాణ

telangana

ETV Bharat / crime

తిక్కవాణిపాలెం బీచ్​లో వేలాది చేపలు మృతి.. కారణం అదేనా..? - Fishes Died at Tikkavanipalem Beach

Fishes Died at Tikkavanipalem Beach : ఏపీలోని విశాఖ జిల్లా పరవాడ మండలంలోని తిక్కవాణిపాలెం బీచ్​లో వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. ఫార్మాసిటీ వ్యర్థాల కారణంగా చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

Fishes Died at Tikkavanipalem Beach
Fishes Died at Tikkavanipalem Beach

By

Published : Mar 15, 2022, 12:03 PM IST

తిక్కవాణిపాలెం బీచ్​లో వేలాది చేపలు మృతి

Fishes Died at Tikkavanipalem Beach : విశాఖ జిల్లా పరవాడ మండలంలోని తిక్కవాణిపాలెం బీచ్​లో​ వేలాది సంఖ్యలో చేపలు మృతి చెందాయి. ఫార్మాసిటీ వ్యర్థాల వల్ల చేపలు చనిపోయాని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రాంకీ ఫార్మాసిటీకి చెందిన కలుషిత నీటిని వదలడం వల్లే చేపల మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్యాలపాలెం నుంచి సముద్రపు నీరు విడిపోయి తిక్కవానిపాలెం వద్ద ఉప్పుటేరులో కలుస్తుందన్నారు.

రాంకీ ఫార్మాసిటీకి చెందిన మెరైన్ అవుట్ ఫుల్ నుంచి కిలోమీటర్ దూరంలో సముద్రంలోకి.. పైపుల ద్వారా వ్యర్థాలను వదులుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎక్కువ శాతంలో వ్యర్థాలను విడుదల చేయడంతో చేపలు మృతి చెందాయని.. దీనివల్ల మత్స్య సంపదకు అపార నష్టం కలుగుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :సరదా శాపమైంది.. ప్రవాహం ప్రాణాలు తీసింది

ABOUT THE AUTHOR

...view details