తిరుమల శ్రీవారి హుండీలో చోరీకి యత్నించిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాత నేరస్థులైన ముగ్గురు యువకులు.. ఆలయంలోని ఓ హుండీ వద్దకు చేరుకున్నారు.
తిరుమల శ్రీవారి హుండీలో చోరీ.. - ap news
తిరుమల శ్రీవారి హుండీలో చోరీకి యత్నించిన ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన తితిదే నిఘా, భద్రతా విభాగం.. దొంగలను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
తిరుమల శ్రీవారి హుండీలో చోరీ..
కానుకలు సమర్పిస్తున్నట్లుగా నటిస్తూ.. భక్తులు వేసే కానుకలను తస్కరించారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన భద్రతా సిబ్బంది.. వారిని అదుపులోకి తీసుకున్నారు. 30 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులుగా గుర్తించిన భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
Last Updated : Mar 23, 2021, 10:41 PM IST